చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ...

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ...

స్కిల్​ కేసులో చంద్రబాబు బెయిల్​ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు ( నవంబర్​ 28) సుప్రీంకోర్టు విచారించింది.  ఈ పిటిషన్​ విచారించిన జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం చంద్రబాబు బెయిల్​కు షరతులు విధించింది.

 ఎలాంటి షరతులు లేకుండా  హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. చంద్రబాబు ఎలాంటి రాజకీయ సభలు పెట్టకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.  ఎలాంటి రాజకీయ సభల్లో పాల్గొనరాదంటూ... . కేసుకు సంబంధించిన విషయాలను బయట మాట్లాడొద్దని చంద్రబాబును ఆదేశించింది.  తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు బెయిల్‌ షరతులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 8 కు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

కాగా స్కిల్‌ స్కాం కేసులో ఇటీవల బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది .అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు బాబుపై పలు ఆంక్షలు విధించింది.